Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాట తప్పరు.మడివ తిప్పరు దుద్దిళ్ల కుటుంబం.!

మాట తప్పరు.మడివ తిప్పరు దుద్దిళ్ల కుటుంబం.!

- రేపు మంత్రి శ్రీదర్ బాబు చిత్ర పటానికి పాలాభిషేకాలు- కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు
నవతెలంగాణ - మల్హర్ రావు
: మాట తప్పరు… మడివ తిప్పరు పేద ప్రజలకు ఇచ్చిన హామీలు తమ ప్రాణాలైన అర్పించి అమలు చేసేది దుద్దిళ్ల కుటుంబం మాత్రమేని తాడిచెర్ల, కాపురం భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు, ఈజిసి రాష్ట్ర సభ్యుడు దండు రమేష్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య అన్నారు.శుక్రవారం రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు తన స్వగ్రామం ధన్వాడ ఉన్నట్లుగా తెలుసుకొని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పులమాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడారు ఇచ్చిన మాట ప్రకారం తమ నేత శ్రీదర్ బాబు తాడిచెర్ల ఓసిపి డేంజర్ జోన్లో ఉన్న ఇండ్ల భూముల పరిహారం ఇప్పించేందుకు ప్రభుత్వం నుంచి రూ.261 కోట్ల నిధులు మంజూరు చేయించారని,కిషన్ రావు పల్లి నుంచి భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు రోడ్డు పనులు వేగవంతం అయ్యేలా కృషి చేశారని చెప్పారు. ఇందుకు శ్రీదర్ బాబుకు కృతజ్ఞతగా ఆయన చిత్ర పటానికి పాలాభిషేకాలు,ప్రత్యేక కృతజ్ఞతలు కార్యక్రమాలను శనివారం చేపట్టునట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కేశారపు చెంద్రయ్య,దన్నపనేని అశోక్ రావు,సురేష్ రావు,పైడాకుల సమ్మయ్య,భిక్షపతి, ఇందారపు శివ,ప్రభాకర్,వొన్న తిరుపతి రావు,తిర్రి అశోక్,కుంట సది,తాండ్ర మల్లేష్,ఆర్టీఐ జిల్లా కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్,కార్యవర్గ సభ్యుడు వెంకటస్వామి పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana