Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మద్యం మత్తులో.. కన్న తండ్రిని కొట్టి చంపిన తనయుడు

నవతెలంగాణ-పెద్ద శంకరంపేట్‌
డబ్బుల విషయంలో తండ్రీకొడుకుల మధ్య గొడవజరగడంతో మద్యం మత్తులో ఉన్న కుమారుడు కన్న తండ్రిని కొట్టి చంపాడు.

ఈ ఘటన మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేట మండలం కోలపల్లి గ్రామంలో శనివారం జరిగింది. పెద్దశంకరం పేట ఎస్‌ఐ నరేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రోమాల సాయిలు (50) కుమారుడు అనిల్‌ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. దసరా పండగ నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చాడు.శనివారం రాత్రి డబ్బుల విషయంలో తండ్రీ కొడుకులు ఘర్షణ పడ్డారు.ఈ ఘర్షణ తీవ్రం కావడంతో కొడుకు అనిల్‌ తండ్రిపై దాడి చేశా డు.దాంతో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమివ్వగా మెదక్‌ డీఎస్పీ సైదులు, అల్లాదుర్గం సీఐ జార్జ్‌,పెద్దశంకరం పేట ఎస్‌ఐ నరేందర్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana