Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహారాష్ట్రలో బైక్, ట్యాక్సీలు రద్దు..!

మహారాష్ట్రలో బైక్, ట్యాక్సీలు రద్దు..!

ముంబయి : మహారాష్ట్రలో చట్టవిరుద్ధంగా బైక్ ట్యాక్సీ సేవలను నిర్వహిస్తున్నారనే ఆరోపణల తో ఓలా, ఉబర్, ర్యాపిడో మొబైల్ యాప్లపై అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిం చింది.

ఈ సంస్థలు మోటార్ వాహ నాల నిబంధనలను పాటించ కుండా.. ఎటువంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండా బైక్ రైడింగ్ సేవలను అందిస్తున్నాయని పేర్కొంటూ మహా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ సైబర్ విభాగానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తమ యాప్ స్టోర్స్ నుండి ఈ మూడు యాప్స్ను వెంటనే తొలగించాలంటూ మహారాష్ట్ర స్టేట్ సైబర్ డిపార్ట్మెంట్ గూగుల్, యాపిల్ సంస్థలకు అధికారికంగా నోటీసులు జారీ చేయడంతో రాష్ట్రంలో క్యాబ్, రైడ్ సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో కర్ణాటక ప్రభుత్వం కూడా మోటార్ వెహికల్ చట్టంలో బైక్ ట్యాక్సీల ప్రస్తావన లేదనే కార ణంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఇలాగే సేవలను నిలిపి వేసింది.

అయితే.. ఆ తర్వాత ఓలా, ఉబర్ సంస్థలు హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయడంతో న్యాయ స్థానం పాత తీర్పును పక్కన బెట్టింది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం బైక్ ట్యాక్సీలను కూడా రవాణా వాహనాలుగా పరిగ ణించవచ్చని, అవసరమైన చట్టబద్ధమైన అనుమతులతో వీటిని నడుపుకో వచ్చని కర్ణాటక కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో దీనిపై ఆదారపడిన రైడర్లు, స్థానిక ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana