Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మహమ్మదాబాద్ గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీవో

వతెలంగాణ - జుక్కల్ జుక్కల్ మండలంలోని మహమ్మదాబాద్ జిపి గ్రామంలో గురువారం నాడు జుక్కల్ ఎంపీవో రాము స్థానిక సర్పంచ్ సూర్నార్ శకుంతల బాలు గ్రామంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగిందని గ్రామపంచాయతీ కార్యదర్శి జీవన్ రాథోడ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటగా గ్రామంలో ఉపాధి హామీ పథకంలో నిర్వహిస్తున్న కాల్వ పనును పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. కొలతల ప్రకారం పనులు నిర్వహించాలని అయితేనే కూలీ డబ్బులు పూర్తిస్థాయిలో లభిస్తాయని ఉపాధి హామీ కూలీలకు సూచించారు.

పని ప్రదేశంలో త్రాగునీరు నీడ ఏర్పాట్లను పూజిస్తాయిలో నిర్వహించి సదుపాయాలు కల్పించాలని పిల్లసిస్టెంట్ను ఆదేశించారు. అనంతరం కూలీలతో సమావేశం ఏర్పాటు చేసి ఉదయం పూట పనులకు రావాలని ఎండ ఉన్న సమయంలో పనులు నిర్వహించకూడదని తెలిపారు. రెండవది అన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని ప్రతి ఒక్కరు ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ పీ ఓ తులసీరామ్, గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్, జిపి కార్యదర్శి జీవన్ రాథోడ్, బ్యూటీ కార్యవర్గ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana