Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మండల కేంద్రంలో ఏసుక్రీస్తు పునరుత్థాన జాతర మహోత్సవం

మండల కేంద్రంలో ఏసుక్రీస్తు పునరుత్థాన జాతర మహోత్సవం

వతెలంగాణ - చౌటకూర్ : మండల కేంద్రంలోని సీఎస్ఐ చర్చి ఆవరణలో ఏసుక్రీస్తు పునరుత్థాన జాతర మహోత్సవ కార్యక్రమం బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం 4:30 గంటల వరకు స్థానిక ఇన్చార్జి గురువులు ఎం రవి కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాడరేటర్ సినాడ్, మెదక్ అధ్యక్షుడు మండలం ఇన్చార్జి బిషప్ ప్రొఫెసర్ డా కె రూబేన్ మార్క్ తండ్రి గారు,ప్రిస్కిల్లా రూబేన్ మార్క్ తల్లి గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా మోడరేటర్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు ప్రభువు చనిపోయి మూడవ దినమున తిరిగి లేచి పునరుత్తానుడైనాడని వివరించారు.వివిధ గ్రామ సంఘాల నుండి వచ్చిన ప్రజలకు అల్మాయిపేట గ్రామ సర్పంచ్ బేగరి దుర్గాప్రసాద్ వారి కుటుంబం తరపున భోజనాలను ఏర్పాటు చేశారు.

అనంతరం పాటలు పాడుతూ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మెన్ డా టి భాస్కర్, మినిస్ట్రియల్ సెక్రెటరీ రేవ కె అండ్రుస్ ప్రేమ్ సుకుమార్, విమల్ సుకుమార్ సినాడ్, మెదక్ అధ్యక్ష మండలం ట్రెజరర్, రేవ కే జేమ్స్ సిసిల్ విక్టర్ మినిస్ట్రియల్ బోర్డు కన్వీనర్ మెదక్, రెవ డా ఎం జార్జ్ ఎబినేజర్ రాజు మెదక్ డిసిసి చైర్మన్, వివిధ సంఘాల ఇన్చార్జి గురువులు, సుధర్మ రవికుమార్,ఎన్ భాస్కర్, కమిటీ మెంబర్లు అశోక్ కుమార్, రాజు, పురుషోత్తం, కరుణాకర్, సంసోన్, యూత్ సభ్యులు, సండే స్కూల్ పిల్లలు, వివిధ గ్రామాల ప్రజలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana