Dailyhunt
మణిపుర్లో రాకెట్ దాడి.. ఇద్దరు చిన్నారుల మృతి

మణిపుర్లో రాకెట్ దాడి.. ఇద్దరు చిన్నారుల మృతి

వతెలంగాణ - హైదరాబాద్: మణిపూర్లోని బిష్నుపూర్ జిల్లా ట్రాంగ్లావి అవాంగ్ లేఖై గ్రామంలో ఉదయం రాకెట్ దాడి జరిగింది. పౌర గృహంపై ప్రొజెక్టైల్ పడటంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

పిల్లల తండ్రి ఓనమ్ మాలెంఘంబా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పని చేస్తున్నాడు. సడన్గా కొండల ప్రాంతాల నుంచి ప్రొజెక్టైల్ పడటంతో ఇంట్లో ఉన్న ఐదేళ్ల కుమారుడు, ఐదు నెలల శిశువు చనిపోగా, తల్లి బినితా ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana