Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంత్రి తుమ్మలను కలిసిన నాయకులు

మంత్రి తుమ్మలను కలిసిన నాయకులు

వతెలంగాణ-ఆర్మూర్హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును శనివారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి,మాక్లూర్ సొసైటీ చైర్మన్ బుర్రోల్ల అశోక్, మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మంత్రి తుమ్మలతో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో మాక్లూర్ సహకార సొసైటీ ధాన్యం కొనుగోళ్లలో నెంబర్వన్గా నిలిచిందని, రైతుల నుంచి పారదర్శకంగా, వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేయడం వల్లే ఈ గుర్తింపు వచ్చిందన్నారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసేలా సొసైటీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.

మాక్లూర్ సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు ఎరువులు, విత్తనాలు, పంటల సాగుకు అవసరమైన సేవలను సమయానికి అందిస్తున్నామని మంత్రి తుమ్మలకు తెలిపారు.ఈ సందర్బంగా సొసైటీ చైర్మన్ అశోక్ ని మరియు డైరెక్టర్లను మంత్రి తుమ్మల అభినందించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు శాలువాతో సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వెల్మల్ గోపి,డికంపల్లి సర్పంచ్ మచర్ల చిన్నయ్య,డైరెక్టర్స్ దయాకర్ రావు, కాశీనాథ్ రావు, గుండారం శేఖర్, మచర్ల రమేష్, ప్రసాద్ రావు,అశోక్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana