Dailyhunt
మరో రెండు వారాల పాటు హార్ముజ్ తెరిచేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

మరో రెండు వారాల పాటు హార్ముజ్ తెరిచేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

వతెలంగాణ - హైదరాబాద్ : అమెరికా, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ జరిగినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. రానున్న రెండు వారాలపాటు హార్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్టు ఇరాన్ మినిస్టర్ అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు.

దీంతో అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ధ్రువీకరించబడింది. సాంకేతిక పరిమితులను పరిగణలోకి తీసుకుంటూ.. ఇరాన్ ఆర్మీ కోఆర్డినేషన్ తో కాల్పుల విరమణ అమలులో ఉండనున్న 14 రోజులు హార్మూజ్ జలసంధిని రీఓపెన్ చేస్తునట్టు ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ తమపై దాడులు నిలిపివేస్తే తమ ఆర్మీ కూడా దాడులు నిలిపివేస్తుందని అన్నారు. ఇరాన్ 10 పాయింట్ల ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా అంగీకరించిందని తెలియజేసారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana