Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మరోమారు మంచి మనసు చాటుకున్న చదలవాడ

మరోమారు మంచి మనసు చాటుకున్న చదలవాడ

సినీ కార్మికులకు అండగా నిలబడటంలో ఎప్పుడూ ముందుంటారు నిర్మాత, దర్శకులు చదలవాడ శ్రీనివాసరావు. చిత్రపురి కాలనీకి కోట్లాది రూపాయల రుణం ఇచ్చి ఆ కాలనీ బ్యాంక్ ఆక్షన్ కు వెళ్లకుండా ఆయన కాపాడారు.

వందలాది సినీ కార్మికుల కుటుంబాల సొంతింటి కలను బతికించారు. ఇప్పుడు సినీ కార్మికులకు మరో వరాన్ని ఇచ్చారు. ఏపి ఫిలిం డెవలప్ కార్పొరేషన్ లో బోర్డు ఆఫ్ డైరెక్టర్ గా నియమితులైన చదలవాడ శ్రీనివాసరావును ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు తమకు శాశ్వత భవనం లేదనే విషయాన్ని శ్రీనివాసరావు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ కార్మికులను ఒకే తాటి మీదికి తీసుకుని వచ్చి వారికి ఉపాధి కలిగే విధానాన్ని విధానాన్నిప్రవేశ పెట్టేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫెడరేషన్ నాయకుల విజ్ఞప్తికి స్పందించిన చదలవాడ ప్రభుత్వం నుంచి స్థలం సేకరించుకోమని, ఆ స్థలంలో అన్ని సౌకర్యాలతో దేశంలో మరే సినీ ఫెడరేషన్ కు లేనంత మంచి భవనం నిర్మించి ఇస్తానని, ఈ భవనం కోసం ఎవరినీ రూపాయి కూడా విరాళం అడగవద్దని సూచించారు. మహానటుడు ఎన్టీఆర్ పేరు మీద ఈ భవనం నిర్మించి ఇస్తానని చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana