Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మరోసారి కేఆర్ఎంబీ సమావేశం వాయిదా

మరోసారి కేఆర్ఎంబీ సమావేశం వాయిదా

వతెలంగాణ-హైదరాబాద్: మరోసారి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం వాయిదా పడింది. బోర్డు 21వ సమావేశాన్ని తొలుత ఈ నెల 14వ తేదీన ఏర్పాటు చేశారు.

అదే రోజు ఏపీ కేబినెట్ సమావేశం ఉండడంతో భేటీని ఈనెల 21వ తేదీకి గతంలో వాయిదా వేశారు. అయితే.. ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. దీంతో కేఆర్ఎంబీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. తెలంగాణ విజ్ఞప్తి మేరకు 21న జరగాల్సిన సమావేశాన్ని కేఆర్ఎంబీ వాయిదా వేసింది. సమావేశం తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కృష్ణా బోర్డు తెలిపింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana