Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మరోసారి పెరిగిన సీ ఎన్ జీ ధరలు

మరోసారి పెరిగిన సీ ఎన్ జీ ధరలు

వతెలంగాణ - హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. తాజా సవరణ ప్రకారం కిలోకు రూ.1 పెంపు చేశారు. ఈ నిర్ణయంతో వారం రోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది రెండోసారి.

రెండు రోజుల క్రితం (మే 15న) కిలో సీఎన్జీ పై రూ.2 పెంపు జరిగింది. దీంతో 48 గంటల్లోనే కిలోకు మొత్తం రూ. 3 పెంచడంతో సీఎన్జీ ఉపయోగించే వాహనదారులపై ప్రభావం పడనుంది. కొత్త ధరల ప్రకారం ఢిల్లీలో సీఎన్జీ ధర కిలోకు రూ.80.09గా ఉండగా, నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో రూ.88.70కి చేరింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana