ఫ్రిడ్జ్లు వచ్చినా తగ్గని ఆదరణనవతెలంగాణ - మల్హర్ రావు
వేసవిలో మట్టికుండ చల్లని నీరందిస్తూ దాహార్తి తీరుస్తుంది. కాలక్రమంలో దీని వినియోగం నామోషీగా మారి ఫ్రిడ్జ్లు వచ్చినా మట్టికుండ తన ఉనికిని కోల్పోలేదు.
ఏటావేసవిలో ఆరోగ్య విషయంలో కుండలు తమ ప్రాధాన్యతను చాటుతున్నాయి. ట్యాబ్లతో కూడిన రాజస్థాన్ కుండలు, మట్టివాటర్ బాటిల్స్ కూజాలు, రంజన్లపై నగర ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మట్టికుండలో నిల్వ చేయబడ్డ నీళ్లు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజన కరమని నిపుణుల అభిప్రాయం.ప్రస్తుతం ఎండలు ముదరడంతో వాటి వినియోగం ఊపందుకుంది. చలివేంద్రాల్లో సైతం కుండలనే వాడుతున్నారు. కుండల ధరలు రూ.100 నుంచి రూ.400 వరకు అందుబాటులో ఉన్నాయి.ఇంకా చిన్నవైతే రూ.50 250 వరకు ఉన్నాయి.గిరాకీ పెరగడంతో కుమ్మరులు వీటి తయారీలో బిజీబిజీ అయ్యారు.

