Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెడిటరేనియన్ డైట్

మెడిటరేనియన్ డైట్

సంపూర్ణ ఆరోగ్యానికి ఇది ఒక మార్గం. మెడిటరేనియన్ డైట్ అనేది మెడిటరేనియన్ (మధ్యధరా) సముద్ర తీర ప్రాంత దేశాలలో ప్రజలు పూర్వం నుండి పాటించే సాంప్రదాయ ఆహారపు అలవాటు.

ఒక ఆరోగ్యకరమైన ఆహార విధానం. ఈ డైట్ ప్రధానంగా మొక్కల ఆధారిత ఆహారాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, తాజా చేపలతో ముడిపడి ఉంటుంది.

తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహార పదార్థాలు
మొక్కల ఆధారిత ఆహారాలు(Plant foods): తాజా కూరగాయలు, పండ్లు, నట్స్ (బాదం, walnuts, brazil nuts మొదలైనవి), విత్తనాలు, గింజలు, పప్పుధాన్యాలు.
ధాన్యాలు (Grains): బ్రౌన్ రైస్, ఓట్స్, హోల్-వీట్(whole wheat) బ్రెడ్ (గోధుమ రొట్టె) వంటి తణధాన్యాలు.
ఆరోగ్యకరమైన కొవ్వులు(Healthy fats): ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ (Extra virgin olive oil) ఉపయోగిస్తారు.
సీ ఫుడ్/ చేపలు (Seafood): వారానికి కనీసం రెండుసార్లు చేపలు, రొయ్యలు/ పీతలు వంటి సీఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే సాల్మన్(Salmon), ట్యూనా(Tuna) వంటి చేపలు చాలా మంచివి.
ఎంత పరిమాణంలో తీసుకోవాలి? (Diet Plan & Frequency)
ప్రతి పూట ఆహారంలో (Eat at every meal): పండ్లు, కూరగాయలు, తణధాన్యాలు, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్.
వారానికి కనీసం 3 సార్లు(Eat at least 3 servings a week): చేపలు/ సీఫుడ్, నట్స్, పప్పుధాన్యాలు.
రోజుకు 1 సర్వింగ్ మాత్రమే (Limit to 1 serving a day): చికెన్ (పౌల్ట్రీ), తక్కువ కొవ్వు ఉన్న డైరీ ఉత్పత్తులు (చీజ్, పెరుగు), గుడ్లు.
వారానికి 1 సర్వింగ్ మాత్రమే(Limit to 1 serving per week): రెడ్ మీట్ (మేక, గొర్రె మాంసం), తీపి పదార్థాలు
పరిమితం చేయాల్సిన లేదా తగ్గించాల్సిన ఆహారాలు (Foods to Limit or Avoid)
రెడ్ మీట్: చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలి.
డైరీ ఉత్పత్తులు (Dairy): జున్ను (Cheese), పెరుగు పరిమితంగా తీసుకోవాలి; తక్కువ కొవ్వు ఉన్న వాటిని ఎంచుకోవడం శ్రేయస్కరం.
ప్రాసెస్ చేసిన పదార్థాలు (Processed items): తీపి పదార్థాలు, చక్కెర పానీయాలు, రిఫైన్డ్ ధాన్యాలు (మైదా వంటివి), ప్రాసెస్ చేసిన మాంసాన్ని పూర్తిగా నియంత్రించాలి లేదా వదిలివేయాలి.
మెడిటరేనియన్ డైట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits)
గుండె ఆరోగ్యం (Heart attack) : హృద్రోగాలు (Heart attack), పక్షవాతం (Stroke) వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు చెడు కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతుంది.
బరువు నియంత్రణ (Weight control): శరీరంలో కొవ్వును తగ్గించి, నడుము చుట్టుకొలత పెరగకుండా సరైన శరీర బరువును కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
వాపు/ మంట తగ్గుదల (Lower swelling): శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణనిస్తుంది.
రక్తంలో చక్కెర, బిపి నియంత్రణ: రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు (BP), కొలెస్ట్రాల్ను సమతుల్యంగా ఉంచుతుంది.
మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం తగ్గుదల: జీవక్రియ సంబంధిత సమస్యల (Metabolic syndrome) నుండి ఉపశమనం కలిగిస్తుంది.
జీర్ణక్రియ ఆరోగ్యం:
జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియా (Gut microbiota) సమతుల్యతను పెంపొందిస్తుంది.
గమనిక: మీ శరీర తత్వానికి మరియు అవసరాలకు తగినట్లుగా ఈ డైట్ను రూపొందించుకోవడానికి డైటీషియన్ను (Dietitian) సంప్రదించడం మంచిది.

వాణి అయోధ్య
క్లినికల్ డైట్ కన్సల్టంట్
9959361180

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana