Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మేయర్ను కలిసిన యూఎస్ కాన్సులేట్ జనరల్

నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మిని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రిఫ్‌మ్యాన్‌, పొలిటికల్‌, ఎకానమిక్‌ ఆఫీసర్‌ సీన్‌రౌత్‌ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రిప్‌మ్యాన్‌ మాట్లాడుతూ.. 'మీరు మేయర్‌ కావడం సంతోషంగా ఉంది. మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం' అన్నారు. మేయర్‌గా వేటికి ప్రాధాన్యత ఇస్తారని కాన్సులేట్‌ జనరల్‌ అడగ్గా నగరంలో విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం వంటి అంశాలపై దృష్టిపెడతానని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సమాధానమిచ్చారు. 18 ఏండ్లు అమెరికాలో ఉన్నారు కదా.. అక్కడికి, ఇక్కడికి తేడా ఏంటి? అని అడిగితే 'అమెరికాలో రొటీన్‌గా మనపని చేసుకుంటాం.

హైదరాబాద్‌లో ప్రజలకు సంబంధించిన పనులు చేయాలి. మురికి వాడలను అభివృద్ధి చేయాలని ఉంది' అంటూ వివరించారు.
టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలి
నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మిని నారిసేన గ్లోబల్‌ ఉమెన్‌ ఫోరం ఫౌండర్‌ లతాచౌదరి, రాధా, ప్రణతి, ఇతర సభ్యులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురబి వాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా మేయర్‌ కోరారు. తమ గ్రూప్‌లో 20 దేశాల నుంచి 6 వేల మంది ఉన్నారని, తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటేసి వాణిదేవిని గెలిపిస్తామని భరోసా ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana