Dailyhunt
మిక్కిలినేని నరేంద్ర నుంచి ప్రాణహాని

మిక్కిలినేని నరేంద్ర నుంచి ప్రాణహాని

కలెక్టరేట్‌ ఎదుట ఫ్లెక్సీ ప్రదర్శించిన దంపతులు
నవతెలంగాణ-ఖమ్మంటౌన్‌
కాంగ్రెస్‌ నాయకుడు మిక్కిలినేని నరేంద్ర నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని అంబటిపూడి మాధవీలత, ప్రసాద్‌ అనే దంపతులు శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ రక్షణ కోరారు. పూర్వీకులకు సంబంధించిన ఆస్తి విషయంలో తమ కుటుంబంలో చిన్న పాటి వివాదం నెలకొందని, ఈవిషయంలో జోక్యం చేసుకుని తమ కుటుంబ సభ్యులను రెచ్చగొట్టి ఉసిగొలపడమే కాకుండా దుర్భాషలాడుతూ చంపుతానని బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. గడిచిన ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరామని, దీన్ని దృష్టిలో పెట్టుకుని మిక్కిలినేని నరేంద్ర, అతని అనుచరులు ఇంటిపైకొచ్చి గొడవలు సృష్టించడం చేస్తున్నారని పేర్కొన్నారు.

పరువుగా బతుకుతున్న తమ కుటుంబంలో చిచ్చు రేపి బజారుకీడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తమ కుటుంబానికి ఆ రౌడీషీటర్‌ వల్ల ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజరు కుమార్‌తో పాటు, జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌కు ఈ విజ్ఞాపనను అందిస్తున్నట్లు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana