Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మొబైల్ ప్రియులకు జియో బంపర్ ఆఫర్

మొబైల్ ప్రియులకు జియో బంపర్ ఆఫర్

వతెలంగాణ - హైదరాబాద్ : రిలయన్స్ జియో తన మొబైల్ వినియోగదారుల కోసం రూ.55 ధరతో 'జియోటీవీ ప్రో ప్యాక్'ను విడుదల చేసింది. ఈ ప్యాక్తో 30 రోజుల పాటు 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను, 150కు పైగా ప్రీమియం ఛానళ్లను అదనపు ఖర్చు లేకుండా వీక్షించవచ్చు.

ఇందులో జనరల్ ఎంటర్టైన్మెంట్, సినిమాలు, వార్తలు, లైఫ్స్టైల్ వంటివి 16కు పైగా భాషల్లో లభిస్తాయి. జియోస్టార్, సోనీ, సన్ టీవీ వంటి ప్రముఖ నెట్వర్క్ల కంటెంట్ అందుబాటులో ఉంటుంది. అయితే, స్పోర్ట్స్ ఛానళ్లు ఈ ప్యాక్లో భాగం కావు. ఈ ప్యాక్ కేవలం వినోద సేవలకు మాత్రమే పరిమితం, వాయిస్ కాల్స్ లేదా SMS ప్రయోజనాలు ఉండవు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana