Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోడీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఏపీలో స్వర్ణకారుల ఆందోళన

మోడీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఏపీలో స్వర్ణకారుల ఆందోళన

వతెలంగాణ-హైదరాబాద్: బంగారం కొనుగోలు చేయొద్దని పీఎం మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో కామాక్షి గోల్డ్ స్మీత్ అసోసియెషన్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.

బ్యానర్ చేతబూని భారీ ర్యాలీ తీశారు. పీఎం మోడీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మాటలతో బంగారు తయారీ వృత్తదారులపై పెను ప్రభావం చూపనుందని, తమ జీవనోపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కలిసి తమ సమస్యలను తెలియజేస్తామని ఆ సంఘం లీడర్లు పేర్కొన్నారు. స్వర్ణకార కార్మికులు, వ్యాపారులు అధిక సంఖ్యలో పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana