Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మొహర్రం వేడుకల్లో ఉద్రిక్తత

వతెలంగాణ-మిడ్జిల్ మొహర్రం పండుగను తెలుగురాష్ట్రాలలో హిందూ ముస్లీంలు మతాలకతీతంగా ఘనంగా జరుపుకుంటారు. శనివారం మండల పరిధిలోని మసిగండ్లపల్లి గ్రామంలో మొహర్రం వేడుకల్లో ఉద్రిక్తత పరిస్తితులు నెలకొన్నాయి.

గ్రామానికి చెందిన ఇరువర్గాలు ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana