Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మొక్కజొన్న పంటకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు

మొక్కజొన్న పంటకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు

వతెలంగాణ-తాడూర్తాడూర్ మండలం చర్ల ఇటిక్యాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎండి. పాషకు చెందిన మొక్కజొన్న పంటకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు.

దీంతో రెండు ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైందని బాదిత రైతు లబోదిబోమన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కాలిపోయిందని, రూ. 1 లక్ష పంట నష్టం వాటిల్లిందని వాపోయారు.

ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, నిందితులను పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. వ్యవసాయ అధికారులు పంట నష్టం అంచనా వేయాలని, తమను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని బాదిత రైతు కుటుంబం విజ్ఞప్తి చేసింది. బాధిత రైతుకు తక్షణ సహాయం అందించాలని స్థానిక రైతాంగం డిమాండ్ చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana