Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముగిసిన సప్తమి వేడుకలు

ముగిసిన సప్తమి వేడుకలు

వతెలంగాణ-కుభీర్ గత వారం రోజుల నుంచి శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో కొనసాగుతున్న తాళ సప్తమి వేడుకలు బుధువారంతో ముగిశాయి. ఈ సందర్బంగా ఆలయ కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో రాజరాజేశ్వరునికి మందిర్ పూజారి జంగం దత్తాత్రి రాజరాజేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి ఆలయం పక్కన శ్రీకృష్ణుడికి ఉయ్యాల వేసి నామకరణం చేశారు.

అనంతరం చిన్నపిల్లలతో శ్రీకృష్ణుడి వేషధారణలో ఉట్టి కొట్టె కార్యక్రమం నిర్వహించారు.

ఈ వేడుకలు గత కొన్ని సంవత్సరాల కాలం నుంచి ఆనవాయితిగా వస్తున్నదని, దాన్ని అదే విధంగా కొనసాగిస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షుడు వి మోహన్ తెలిపారు. ఈ వేడుకలకు గత వారం రోజుల నుంచి ప్రతిరోజు ఆర్యవైశ్యులు గ్రామస్తులు పూజలు చేసి నిత్య అన్నదానం కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చివరి రోజున గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఆయా గ్రామాలకు చెందిన భక్తులు హాజరై రాజరాజేశ్వరునికి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వి మోహన్ స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్ సభ్యులు పోశెట్టి సంతోష్ సురేష్ బాబు రాజేశ్వర్ ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana