Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మున్సిపల్ కార్యాలయం వద్ద పంచాయతీ

మున్సిపల్ కార్యాలయం వద్ద పంచాయతీ

వతెలంగాణ-ఆలేరు టౌన్ ఆలేరు మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం జండా ఆవిష్కరణ అనంతరం మున్సిపల్ చైర్మన్ భర్త, మరియు నాలుగో వార్డ్ కౌన్సిలర్ భర్త, ఇరువురి మధ్య పంచాయతీ నెలకొంది.

జెండా ఆవిష్కరణ అనంతరం సమావేశం హాల్లో మున్సిపల్ చైర్మన్ బీజనా బాలమని, కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో సమావేశం హలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు కూర్చున్నారు. నాలుగో వార్డ్ కౌన్సిలర్ బీజాన కళ్యాణి ,భర్త బీజన మధు, ఆలేరు అభివృద్ధి గురించి మాట్లాడుతూ అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని కోరుతుండగా, మున్సిపల్ చైర్మన్ స్పందిస్తూ అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారని చెబుతు, కొందరు కౌన్సిలర్లు అభివృద్ధి వద్దు, శిలాఫలకాలలో పేర్లు ఉంటే చాలానట్టు ఉంది అన్నారు. ఈ పరిణామాలలో గొడవ పెరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవను ఆపారు. ఇరువైపులా నుండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana