Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మున్సిపల్ పాలక వర్గ సమావేశంలో వాట్సాప్ గ్రూప్ లొల్లి

మున్సిపల్ పాలక వర్గ సమావేశంలో వాట్సాప్ గ్రూప్ లొల్లి

వతెలంగాణ - రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో వాట్సాప్ గ్రూప్ లొల్లి అలుముకుంది. కౌన్సిలర్లు అధికారులతో కలిసి వాట్సాప్ గ్రూప్ ను తయారు చేశారు.

కొద్ది రోజులు సజావుగానే నడిచిన ఆ గ్రూపు లో నుంచి మున్సిపల్ అధికారులు లెఫ్ట్ అయ్యారు. ఈ విషయం పాలకవర్గ సమావేశంలో మాట్లాడటం వరకు వచ్చింది. మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ మున్సిపల్ సమావేశంలో మాట్లాడుతూ.. మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లతో కలిపి గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. గ్రూప్ క్రియేట్ చేయడం ఇష్టం లేదా.. మా సమస్యలు మీకు అవసరం లేదా.. ఆ గ్రూపులో నుంచి అధికారులు ఎందుకు లెఫ్ట్ అయ్యారు వార్డు సమస్యలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ గ్రూపు ను క్రియేట్ చేస్తే అధికారులు లెఫ్ట్ అవ్వడానికి కారణాలు ఏంటని ఆయన ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. దీంతో వెంటనే మున్సిపల్ కమిషనర్ ఖాదర్ పాషా సమాధానం ఇస్తూ వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసింది వాస్తవమే కానీ దాంట్లో నుంచి అధికారులు లెఫ్ట్ అవ్వడానికి కారణం మాత్రం దాంట్లో కొంతమంది తప్పుడు మెసేజ్ లు పెట్టడమేనని ఆయన సమాధానం ఇచ్చారు. సభ్యులకు ఎలాంటి సమస్య ఉన్న నా దగ్గరకు వచ్చి చెబితే పరిశీలిస్తానని, మున్సిపల్ కార్యాలయం నుంచి వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి పాలకవర్గ సభ్యులను గ్రూపులో చేర్చుతామని ఆయన సమాధానం ఇచ్చారు. ఇలా జరుగుతుండగా కొంతమంది సభ్యులు విలేకరులు ఉన్నారు ఇలాంటి ప్రశ్నలు అడగడం ఏంటి అని తర్వాత మనం మాట్లాడుకుందాం అంటూ అనడం కనిపించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana