Dailyhunt
మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి

మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి

ర్ సన్నద్ధతపై అడిషనల్ సీఈవో వెంకటేశ్వర్ రెడ్డినవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఓటర్ల మ్యాపింగ్ 50 శాతం కంటే తక్కువగా ఉన్న ఆరు జిల్లాల్లో మ్యాపింగ్ ప్రక్రి యను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి ఆదేశించారు.

రానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో భాగంగా సోమవా రం హైదరాబాద్ నుంచి ఆయన 50 శాతం కంటే తక్కువగా ఓటర్ల మ్యాపింగ్ ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన 28 అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎలక్టోరల్ మ్యాపింగ్, డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీల పరిష్కారం, ఫారం 6, 6ఏ, 7, 8 పెండింగ్లను సమీక్షించారు. 2025 ఓటర్ల జాబితాలోని అర్హులైన ఓటర్లందరినీ 2002 ఓటర్ల జాబితాతో మ్యాప్ చేయాలని ఆయన ఆదేశించారు. బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాలు సేకరించి, మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

బూత్ లెవెల్ ఏజెంట్ల సహాయాన్ని ఉపయోగించుకోవాలనీ, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. చనిపోయిన, బహుళ, మారిన ఓటర్లను గుర్తించి, ఎస్ఓపీ ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలనీ, వీవీఐపీ, వీఐపీ ఓటర్లను ఓటర్ల జాబితాలో తగిన విధంగా గుర్తించాలన్నారు. యాక్షన్ ప్లాన్ ప్రకారం మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశించిన రోజువారీ లక్ష్యాలను సాధించాలని ఏఈఆర్వోలను ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఈవో తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana