Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నార్నే నితిన్ నయా సినిమా షురూ..

నార్నే నితిన్ నయా సినిమా షురూ..

రుసగా మూడు విజయవంతమైన చిత్రాలలో నటించిన హీరో నార్నే నితిన్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'జూనియర్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ రెడ్డితో ఒక యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కోసం జతకట్టారు.

ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తుండగా, లోహిత ఎన్.కె క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో నార్నే నితిన్ సరసన అనికా సురేంద్రన్, మేఘా శెట్టి కథా నాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర అనౌన్స్మెంట్ పోస్టర్ ప్రేక్షకులలో భారీ ఆసక్తిని రేకెత్తించింది. ఆదివారం సంప్రదాయ పూజా కార్యక్రమంతో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది.

ముహూర్తపు షాట్కు నిర్మాత వెంకట్ కె నారాయణ క్లాప్ కొట్టగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కెమెరాను ఆన్ చేశారు. 'మ్యాడ్` దర్శకుడు కళ్యాణ్ శంకర్ ప్రారంభ షాట్కు దర్శకత్వం వహించగా, వెంకట్ కె నారాయణ స్క్రిప్ట్ను దర్శకుడు రాధాకృష్ణకు అందజేశారు. రొమాన్స్, కామెడీ, మనసుని హత్తుకునే భావోద్వేగాల కలయికతో బలమైన ఎమోషనల్ అంశాలతో కూడిన కంప్లీట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది అని మేకర్స్ తెలిపారు. నార్నే నితిన్, అనిఖా సురేంద్రన్, మేఘా శెట్టి నాయకానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి నిర్మాత: వెంకట్ కె నారాయణ, రచన, దర్శకత్వం: రాధా కృష్ణ రెడ్డి, క్రియేటివ్ ప్రొడ్యూసర్: లోహిత ఎన్కె, సంగీతం: వివేక్ - మెర్విన్, డీఓపీ : రామ మారుతి ఎం., ఎడిటర్: నిరంజన్ దేవరమానె, ఆర్ట్ డైరెక్టర్: శివ కామేష్ డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శరణ్య పోట్ల, అజయ్ గద్దె, కాస్ట్యూమ్ డిజైనర్: దిలేషా.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana