Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నార్వే జర్నలిస్టుకు చేదు అనుభవం

నార్వే జర్నలిస్టుకు చేదు అనుభవం

వతెలంగాణ-హైదరాబాద్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నార్వే పర్యటన వేళ …. నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో అనూహ్య ప్రశ్న సంధించి వార్తల్లో నిలిచిన నార్వే మహిళా జర్నలిస్టు హెల్లే లింగ్ కు చేదు అనుభవం ఎదురైంది.

ఆమె సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేస్తూ మెటా షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె కూడా ధ్రువీకరించారు.

హెలె లింగ్ ట్వీట్ చేస్తూ …. తన ఖాతా నిలిపివేయబడటానికి ముందు రోజంతా తన ఇన్స్టాను యాక్సెస్ చేయలేకపోయానని తెలిపారు. 'పత్రికా స్వేచ్ఛ కోసం చెల్లించాల్సిన చిన్న మూల్యమే ఇది, కానీ ఇలాంటి అనుభవం ఇంతకు ముందెప్పుడూ ఎదురు కాలేదు,' అని ఆమె తన సస్పెన్షన్ నోటీసు స్క్రీన్ షాట్ షేర్ చేశారు. మెటా యాజమాన్యంలోని ప్లాట్ఫామ్స్ ద్వారా తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులకు, తన ఇన్స్టా, ఫేస్బుక్ ఖాతాలు రెండూ సస్పెండ్ అయ్యాయని మరో పోస్ట్లో లింగ్ తెలియజేశారు. తాను వీలైనంత ఎక్కువ మంది భారతీయులకు స్పందించాలనుకున్నా, కానీ ఇప్పుడు అది లేట్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కానీ తన ఖాతాలు తిరిగి యాక్టివ్ అవుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తన పోస్ట్కు ఆమె మెటాను కూడా ట్యాగ్ చేస్తూ రాశారు. కాగా, ప్రధాని మోడి పత్రికా సమావేశంలో తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ బాగా వైరల్ అయింది. ఆమె ఫాలోవర్లు కూడా పెరిగారు. దీనిపై బిజెపి శ్రేణులు లింగ్పై విరుచుకుపడగా, పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana