Dailyhunt
నాటు సారాయి, మద్యం అమ్మకాలు నిలిపివేయాలి

నాటు సారాయి, మద్యం అమ్మకాలు నిలిపివేయాలి

వతెలంగాణ-సిర్పూర్ (టి )గ్రామంలో నాటుసారా తయారీతో పాటు బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు విస్తృతంగా కొనసాగుతున్నాయన్న ప్రజల ఫిర్యాదుపై పాలకమండలి స్పందించింది.

గ్రామస్తుల వినతిని పరిగణలోకి తీసుకున్న సర్పంచ్ ఒడ్డెటి నాగమణి, పాలకమండలి సభ్యులు గత నెల 13న నిర్వహించిన గ్రామసభలో ఈ అంశంపై చర్చించారు. గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ మేరకు శనివారం కాగజ్నగర్లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని సంప్రదించి సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో నాటుసారా తయారీ, బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని కోరారు. ప్రజల ఆరోగ్యం, గ్రామ శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కల్పన, అస్లాంబిన్ అబ్దుల్లా, గ్రామస్తులు నానయ్య, మొయిజ్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana