Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాయకపోడు సేవ సంఘం నూతన రాష్ట్ర బాడీ ఎన్నిక

నాయకపోడు సేవ సంఘం నూతన రాష్ట్ర బాడీ ఎన్నిక

వతెలంగాణ-మల్హర్ రావుతెలంగాణ రాష్ట్ర నాయకపోడ్ సేవ సంఘం నూతన బాడీని ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు మేసినేని రాజన్న మంగళవారం తెలిపారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఆదివాసీ భవన్ నెహ్రు పార్క్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పూర్తి ప్రకటించారు.రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా మండలం రుద్రారం గ్రామానికి చెందిన గొట్టం భూమయ్య,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నెరేడుపల్లి గ్రామానికి చెందిన మాంత నాగరాజు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ ని కలిసి రాష్ట్రంలో ఉన్న నాయకపోడు,తెగను కులగనన చేసి ప్రత్యేక గేజీట్ నెంబర్ నియమించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గాండ్ల రామచందర్,కోశాధికారి ధైనేనీ రమేష్,ప్రధాన కార్యదర్శి పోతిండ్ల, జిల్లా నాయకులు సుంకరి మల్లేష్,చింతల సుధాకర్,గోస్కుల రాజశేఖర్ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana