Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నసీమ్ ఆరిఫీ ఉర్దూ మీడియాఅవార్డుల ప్రధానం

నసీమ్ ఆరిఫీ ఉర్దూ మీడియాఅవార్డుల ప్రధానం

వతెలంగా-హైదరాబాద్ఉర్దూ భాష, సాహిత్యం, జర్నలిజం అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖ ఉర్దూ జర్నలిస్టు స్వర్గీయ నసీమ్ ఆరిఫీ సేవలను స్మరించుకుంటూ నసీమ్ ఆరిఫీ ఉర్దూ మీడియా అవార్డుల ప్రధానం-2025 అవార్డులను ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి, దౌత్యవేత్త డాక్టర్ ఆసఫ్ సయీద్ హాజరై మాట్లాడుతూ ఉర్దూ మీడియా సమాజంలో నసీమ్ ఆరిఫీ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన గుర్తు చేశారు. యువ జర్నలిస్టులు నిబద్ధతతో, సామాజిక బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్బంగా నసీమ్ ఆరిఫీ పై అకాడమీ ముద్రించిన చిరు పుస్తకాన్ని మొనొగ్రాఫ్ ఆవిష్కరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో శనివారం 'నసీమ్ ఆరిఫీ ఉర్దూ మీడియా అవార్డ్స్-2025' సెటీ ఫౌండేషన్ , తెలంగాణ మీడియా అకాడమీ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ కె శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడుతూ ప్రస్తుతం మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టుల జీవిత చరిత్రలు, అనుభవాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు 12 మోనోగ్రాఫ్లను విడుదల చేసినట్టు తెలిపారు.

నేటి వేగవంతమైన జీవనశైలిలో పుస్తకాలు చదివేందుకు సమయం దొరకని పరిస్థితుల్లో, ఈ మోనోగ్రాఫ్లు జర్నలిజం రంగంలో ప్రముఖుల గురించి తెలుసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. అవార్డుల ప్రాముఖ్యతపై మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగం డీన్, హెచ్ఓడీ ప్రొఫెసర్ ఎబ్తేశామ్ అహ్మద్ ఖాన్ సైతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు అమీర్ ఉల్లా ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలలో ప్రతిభ కనబరిచిన ప్రముఖ ఢిల్లీ వాస్తవ్యులు మాసూమా మురాదాబాద్ కు జీవిత సాఫల్య పురస్కారం, యామీన్అన్సారీ, హైదరాబాద్ వాస్తవ్యలు మహ్మద్ అలీమొహియుద్దీన్, ఎంపడీ ఫజల్ బేగ్, రోహిణి సింగ్కు నసీమ్ అరిఫీ ఉర్దూ మీడియా అవార్డులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమాన్ని సెటీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సయ్యద్ బషారత్ అలీ నిర్వహించగా, మీడియా అకాడమీ సెక్రటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు, జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు, సాహితీవేత్తలు, ఉర్దూ భాషాభిమానులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana