Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నవాబు పేటలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆకస్మిక పర్యటన

నవాబు పేటలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆకస్మిక పర్యటన

వతెలంగాణ - నవాబు పేట: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు విద్యార్థులకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు.మండలంలోని కారుకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్), నవాబ్పేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తనిఖీ చేశారు.కారుకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(జెడ్.పి.హెచ్.ఎస్)ను సందర్శించిన ఆయన పాఠశాలలో పారిశుధ్య నిర్వహణ, పరిసరాల్లో పిచ్చి మొక్కలు, పొదల తొలగింపు పనులను పరిశీలించారు.

పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం అందేలా పారిశుధ్య పనులను నిరంతరం చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యా, మౌలిక వసతులకు సంబంధించిన అంశాలను కూడా పరిశీలించారు.నవాబ్పేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కె .జి.బి.వి) ను సందర్శించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి వారి యోగక్షేమాలు, విద్యాభ్యాసం, విద్యాలయంలో అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కొంత సమయం గడిపిన ఆయన, వారి సమస్యలు, అవసరాలను తెలుసుకుని, ప్రభుత్వం అందిస్తున్న విద్య, వసతి, భోజనం తదితర సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన అదనపు కలెక్టర్, భోజనం నాణ్యత, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.కారుకొండ పర్యటనలో మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) నాగ్య నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దశరథ్ నాయక్, కారుకొండ భూపాల్ రెడ్డి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఈఓ) వెంకట్ రెడ్డి, ఎంపిడిఓ జయరాం నాయక్, ఎంపిఓ భద్రు నాయక్, స్పెషల్ ఆఫీసర్ (ఎస్ఓ) మాధవి నవాబుపేట సర్పంచ్ గీతారాణిసుధాకర్ చారి పంచాయతీ కార్యదర్శి నరేష్ కారోబార్ లక్ష్మయ్య అధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana