హైదరాబాద్: వచ్చే నవంబర్ ఒక్కటో తేదిన పిబి ఫిన్‌టెక్ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు రానుంది. పాలసీబజార్, పైసా బజార్ పేరుతో ఆన్‌లైన్‌లో పలు సంస్థల బీమా, రుణ ప్లాన్లను ఒకే వేదికపై అందించే ఈ ఫిన్‌టెక్ తొలి ఇష్యూలో రూ.2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్ ధరల శ్రేణీని రూ.940 రూపాయల నుంచి రూ.980గా నిర్ణయించింది.
