- మోటర్ బిగించిన పాలకవర్గం, అధికారులు నవతెలంగాణ - మల్హర్ రావు : మండలం ఆన్సాన్పల్లిలోని ఒకటవవార్డులో నీటి ఎద్దడి అనే కథనం గురువారం నవ తెలంగాణ దినపత్రిక వరంగల్ ఎడిసిన్ లో ప్రచురించిన విషయం తెలిసిందే.ఈ కథనానికి పంచాయతీ పాలకవర్గం,పంచాయతీ, మిషన్ భగీరత అధికారులు ఎట్టకేలకు స్పందించారు.గురువారం ఒకటవవార్డులో చెడిపోయిన బోర్ మోటర్ కు మరమ్మతులు చేయించి బిగించారు.
దీంతో గత రెండుమూడు వారాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి కష్టాలు తొలగిపోయాయని ప్రజలు పేర్కొన్నారు.

