Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నవ్వించే 'క్రేజీ కళ్యాణం'

నవ్వించే 'క్రేజీ కళ్యాణం'

రేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'క్రేజీ కల్యాణం. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.

2గా బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. బద్రప్ప గాజుల దర్శకుడు. శనివారం ఈ సినిమా టీజర్ ను డైరెక్టర్ నందిని రెడ్డి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ బూసం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ,'నేను నిర్మాతగా చేస్తున్న రెండో చిత్రమిది.

ఫస్ట్ మూవీ అఖిల్ రాజ్ తో 'విందు భోజనం అని చేశాను. ఇప్పుడు ఈ సినిమా నిర్మిస్తున్నాను. స్క్రిప్ట్ విషయంలో మొదటి నుంచి మా వేణు ఊడుగుల సహకారం అందిస్తున్నారు. దర్శకుడు భద్రప్ప నాకు 12 కథలు చెప్పారు.

ఆ కథల్లో ఇది సెలెక్ట్ చేసుకున్నాంఅని తెలిపారు. 'మనం నిజ జీవితంలో చూసే పాత్రలు, మన ఇరుగు పొరుగు వ్యక్తులను పోలిన క్యారెక్టర్స్ మా మూవీలో ఉంటాయి. మా చిత్రంలో నవ్వులతో పాటు మనసుకు హత్తుకునే ఎమోషన్స్ ఉన్నాయి అని డైరెక్టర్ భద్రప్ప గాజుల చెప్పారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ,'ఇది స్మాల్ అండ్ స్వీట్ ఫిలిం. ఈ కథ వింటూ నవ్వీ నవ్వీ కడుపు నొప్పి వచ్చింది. దర్శకుడు బద్రప్ప చెప్పింది చెప్పినట్లుగానే అద్బుతంగా తెరకెక్కించారు` అని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana