నవతెలంగాణ - జుక్కల్ మండలంలోని మహారాష్ట్ర , కర్ణాటక సరిహద్దు గ్రామం చెండేగావ్ లో గ్రామ సర్పంచ్ బండేడ్ వార్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేక గ్రామసభ శనివారం నిర్వహించడం జరిగిందని గ్రామ పంచాయతీ కార్యదర్శి వికాస్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్ ఎఫ్ బి ఎస్ అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ మహిళా గ్రామసభ ఎజెండా, సభ ప్రారంభం మరియు అధ్యక్షుల ప్రసంగం. గత మహిళా గ్రామసభ తీర్మానాల అమలు నివేదిక చదివి వినిపించడం జరిగింది.
గ్రామంలోని మహిళల సమస్యలపై చర్చ..
మహిళల ఆరోగ్యం, పోషకాహారం, గర్భిణీలు మరియు బాలింతల సంక్షేమం.అంగన్వాడీ, ఆశా సేవలు వివరాలు వివరించడం జరిగింది. మరియు పాఠశాలల్లో బాలికల విద్య.మహిళల భద్రత, గృహహింస నివారణ మరియు చట్టపరమైన అవగాహన.స్వయం సహాయక సంఘాలు (SHGs) - పొదుపు, రుణాలు మరియు ఉపాధి అవకాశాలు అందుతున్నాయా లేదా అని చర్చించడం జరిగింది.తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్లు మరియు ఘన వ్యర్థాల నిర్వహణ, ఉపాధి హామీ పథకం (MGNREGS)లో మహిళల భాగస్వామ్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు మరియు అర్హుల ఎంపిక బాగా దర్శకంగా జరుగుతుందో లేదో మహిళా సభ్యులకు అడిగి తెలుసుకోవడం జరిగింది.
బాల్య వివాహాల నివారణ, మహిళా సాధికారతపై అవగాహన నిర్వహించారు. అనంతరం గ్రామ అభివృద్ధి ప్రణాళికలో మహిళల సూచనలు.మహిళల నుండి వచ్చిన వినతులు, ఫిర్యాదుల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండేడ్ వార్ లక్ష్మణ్ తో పాటు ఉప సర్పంచ్, బీపీ కార్యవర్గం, జిపి కార్యదర్శి వికాస్ రెడ్డి , గ్రామ మహిళా సంఘం సభ్యులు, మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- సర్ సర్వే ని పరిశీలించిన సర్పంచ్: జాతీయ ఓటర్ల జాబితా సమగ్ర సర్వేలు గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ జిపి కార్యదర్శి వికాస్ రెడ్డితో కలిసి సర్వే ప్రక్రియ పరిశీలించారు. నిర్వహిస్తున్న అధికారులకు పూర్తిస్థాయిలో తమ సహకరించిందని ఇటువంటి సమస్యలు వచ్చిన తమ దృష్టికి తీసుకురావాలని సర్వే అధికారులు తెలిపారు.

