హోం
నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

హైదరాబాద్: తిరుపతి మీదుగా వెళ్లే 18 రైళ్లను పూర్తిగా, మరో 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రైల్వే స్టేషన్ రీమోడలింగ్ పనులు జరుగుతున్న కారణం రిత్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. తిరుపతి స్టేషన్ మీదుగా వెళ్లే రెండు రైళ్ల హాల్టింగ్ ను తొలగించామని, మరో నాలుగు రైళ్లను దారి మళ్లించామని పేర్కొన్నారు. దక్షిణం వైపు నాన్ ఇంటర్ లాకింగ్, ప్రీ నాన్ ఇంటర్ లాకింగ్, ఎలక్ట్రిఫికేషన్ తదితర పనులు జరగనున్నాయని అన్నారు. 12వ తేదీ వరకూ రైళ్ల రద్దు కొనసాగుతుందని భక్తులు, ప్రయాణికులు గమనించాలని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 4న నడిచే విశాఖపట్నం-తిరుపతి రైలు(02707)కు రేణిగుంట, తిరుపతి మధ్య ప్రయాణాన్ని పాక్షికంగా రద్దు చేశామని పేర్కొంది. అదే విధంగా 5న నడిచే చెన్నై సెంట్రల్-తిరుపతి రైలు(06095), చెన్నై సెంట్రల్-తిరుపతి మధ్య 5, 12 తేదీల్లో నడిచే రైలు(06057), తిరుపతి-చెన్నై సెంట్రల్ రైలు(06096), తిరుపతి-చెన్నై సెంట్రల్ రైలు(06008), తిరుపతి, రేణిగుంటల మధ్య, 11, 12 తేదీల్లో నడిచే వల్లీపురం-తిరుపతి, తిరుపతి-వల్లీపురం రైళ్ల ప్రయాణాన్ని పాక్షికంగా రద్దు చేశామని వివరించింది. ఈ నెల 7న నడిచే నాగర్‌కోయిల్-షాలిమార్ రైలును కట్‌పాడి, మెల్‌పాక్కం, రేణిగుంట మీదుగా.. 5న నడిచే రామేశ్వరం-ఓఖ రైలును కట్‌పాడి, మెల్‌పాక్కం, రేణిగుంట మీదుగా.. 8న నడిచే యశ్వంత్‌పూర్ రైలును కట్‌పాడి, మెల్‌పాక్కం, రేణిగుంట మీదుగా.. 11న నడిచే యశ్వంత్‌పూర్-హాతియా రైలును కట్‌పాడి, మెల్‌పాక్కం, రేణిగుంట మీదుగా దారి మళ్లించామని వివరించింది.