Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిబంధనలకు అదానీ పాతర

నిబంధనలకు అదానీ పాతర

సెబీకి ఫిర్యాదు.. విచారణ జరపాలని డిమాండ్కేరళంలోని విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయ ప్రాజెక్టులో వాటాల బదిలీ
యూడీఎఫ్ సర్కారుకు తెలియకుండానే డీల్

మాజీ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం

కన్నూర్ : కేరళంలోని విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయ ప్రాజెక్టులో అదానీ గ్రూప్ ప్రతిపాదించిన 49 శాతం వాటాల బదిలీ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ సెబీ, స్టాక్ ఎక్స్చేంజీలకు ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ సీఎం పినరయి విజయన్ లేఖ రాశారు. అదానీ విజింజం పోర్ట్ ప్రయివేటు లిమిటెడ్ (ఏవీపీపీఎల్)లోని 49 శాతం వాటాను సుమారు 1.4బిలియన్ డాలర్ల (దాదాపు రూ.13,300 కోట్లు)కు మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ (ఎంఎస్సీ) కొనుగోలు చేయనున్నట్టు అదానీ పోర్ట్స్ ప్రకటించిన నేపథ్యంలో విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు.
కన్సెషన్ ఒప్పందంలోని క్లాజ్ 5.3.1 ప్రకారం 25 శాతానికి మించిన వాటాల బదిలీ లేదా యాజమాన్య మార్పునకు రాష్ర్ట ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని విజయన్ పేర్కొన్నారు. అయితే అదానీ గ్రూప్ సెబీకి సమాచారం ఇచ్చిన్నప్ప టికీ కేరళం ప్రభుత్వానికి తెలియజేయకుండా, అనుమతి పొందకుండా ఈ ప్రక్రియను కొనసాగిం చడం ఒప్పంద ఉల్లంఘనే అవుతుందన్నారు. ఇది ప్రజా ప్రయోజనాలు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై అదానీ గ్రూప్ నుంచి వివరణ కోరాలని డిమాండ్ చేశారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని సెబీని కోరారు. జులై1న అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు ప్రభుత్వం వద్దకు ఎలాంటి అనుమతి దరఖాస్తు రాలేదని ముఖ్యమంత్రి వెల్లడించిన ప్పటికీ.. అనంతరం మీడియాలో వచ్చిన కథనాలు భిన్నంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రజల సొమ్ముతో నిర్మితమైన విజింజం పోర్టు రాష్ట్రానికి అత్యంత కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టు అని విజయన్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం స్పందించలేదని.. సెబీని ఆశ్రయించే కనీస చర్య కూడా తీసుకోలేదని విమర్శించారు. ముఖ్య మంత్రి వద్దే పోర్టులు, న్యాయ, ఆర్థిక శాఖలు ఉండ టంతో ప్రభుత్వ పాత్రపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వ్యాఖ్యానించారు.
తన అభ్యంతరం ఎంఎస్సీ సంస్థపై కాదని విజయన్ స్పష్టం చేశారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్ సంస్థల్లో ఒకటైన ఎంఎస్సీ విజింజం పోర్టులో గణనీయమైన వాటా సొంతం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో గుత్తాధిపత్య ధోరణి పెరిగి పోటీ తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల పెట్టుబడులు, పోర్టు భవిష్య త్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana