Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట్ పేపర్ లీక్ కేసు

నీట్ పేపర్ లీక్ కేసు

లాతూర్ వైద్యుడు అరెస్ట్ సీబీఐ దర్యాప్తు ముమ్మరం​ముంబయి : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 పరీక్ష‍ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది.

తాజాగా మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన పిల్లల వైద్యుడు మనోజ్ షిరురేను అరెస్ట్ చేసింది. తన కుమారుడు వైద్య ప్రవేశ పరీక్ష‍కు సిద్ధమవుతున్న నేప థ్యంలో.. లీకైన ప్రశ్నపత్రాన్ని డబ్బులు చెల్లించి కొనుగోలు చేసినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఒక పేరెంట్ అరెస్టవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సీబీఐ దర్యాప్తు ప్రకారం… మే 3న నీట్-యూజీ 2026 పరీక్ష‍లకు ముందే లీకైన ప్రశ్న పత్రాన్ని లాతూర్కు చెందిన ఆర్సీసీ క్లాసెస్ వ్యవస్థాపకుడు శివరాజ్ మోటేగావోంకర్ నుంచి డాక్టర్ షిరురే కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణం ద్వారా కోచింగ్ సంస్థలు, ప్రశ్నపత్రాల లీక్ ముఠాలు, అలాగే తమ పిల్లలకు మెడికల్ సీట్లు సంపాదించాలనే ఆత్రుతలో ఉన్న కొంతమంది తల్లిదండ్రుల మధ్య ఉన్న సంబంధాలు బయటపడుతున్నాయని దర్యాప్తు అధికారులు తెలిపారు. పలువురు ప్రభావశీలురైన తల్లిదండ్రులు రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ పి.వి. కులకర్ణి, మోటేగావోంకర్కు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెల్లించి పరీక్ష పేపర్ను ముందుగానే పొందినట్టు విచారణలో వెల్లడైంది. డాక్టర్ షిరురే కూడా వారిలో ఒకరని అధికారులు చెప్తున్నారు. మహారాష్ట్రలోని మరికొంత మంది తల్లిదండ్రులు, విద్యా ర్థులు కూడా ఈ లీక్ వ్యవహారంలో పాల్గొన్నారనే అనుమానంతో వారి హస్తం పైనా నిగ్గు తేల్చేందుకు సీబీఐ దృష్టి సారించింది.

ఇక దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తుది నీట్-యూజీ 2026 పరీక్షలో వచ్చిన 45 కెమిస్ట్రీ ప్రశ్నల్లో 43 ప్రశ్నలు ఆర్సీసీ సంస్థ ముందుగా విడుదల చేసిన గెస్ పేపర్లో ఉన్న ప్రశ్నలతో సరిపోలినట్టు సీబీఐ గుర్తించింది. అంతేకాకుండా.. మోటేగావోంకర్ తన సిబ్బందితో మాట్లాడుతూ.. 'పరీక్షకు పది రోజుల ముందు నిర్వహించిన మాక్ టెస్టుల్లో ఇచ్చిన ప్రశ్నలే తుది పరీక్షలో యథాతథంగా వచ్చాయి' అని చెప్పిన వీడియో వైరల్ అయిందని అధికారులు తెలిపారు.ప్రశ్నల సంఖ్యలు, ఫార్మాట్ కూడా మారలేదని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. మోటేగావోంకర్ లాతూర్లో ఎంపిక చేసిన కొంతమంది విద్యార్థులకు ప్రత్యేకంగా రాత్రి తర గతులు నిర్వహించి, చేతితో రాసిన ప్రశ్న పత్రాలు, సమాధాన పత్రాలను ప్రాక్టీస్ కోసం పంపిణీ చేశాడని సీబీఐ అధికారులు అంటు న్నారు. ఇక ఈ పేపర్ లీక్ నెట్వర్క్కు సంబం ధించిన డబ్బుల లావాదేవీలు, కమ్యూనికేషన్ రికార్డులు, ఆర్థిక మార్గాలను కూడా సీబీఐ లోతుగా విచారిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana