Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట మునిగిన పంటలను పరిశీలించిన ఎంపీడీఓ

నీట మునిగిన పంటలను పరిశీలించిన ఎంపీడీఓ

వతెలంగాణ - జుక్కల్ మండలంలోని ఖండేబల్లూరు గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన పంటలను మంగళవారం జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో వర్షాలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయని, వాతావరణం చల్లబడడంతో ఎప్పుడు పెద్ద వర్షాలు పడతాయో అని రైతులు ఇంకా భయంతో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం పంటలను కాపాడుకోవడంతోపాటు గ్రామాలలో చెరువు గట్లు కాలువలు, కుంటలు నిండుతున్నాయని, గ్రామస్తులు పాత ఇండ్లలో ఉండకుండా కొత్త గృహాలలో ఉండాలని సూచించారు. గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉంటూ..రోజూవారీ సమాచారం అందిస్తూ అలర్ట్ గా ఉండాలని ఎంపీడీవో శ్రీనివాస్ ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana