నవతెలంగాణ-ఘట్‌కేసర్
అన్యాం పూణ్యం తేలియని ఓ పసి బాలుడు ఆడుకుంటూ వేళ్లి నీటి గుంటలో పడి మృతి చేందిన సంఘటన ఘట్‌కేసర్ పోలిస్ స్టేషన్ పరిధిలో అంకుషాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలిసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చిన్న పోచారం గ్రామానికి చెందిన గజ్జి.సత్తయ్య భార్య కూమారుడు గణేష్(7) తో కూలీ పనికోసం వలసవచ్చి మండలంలో అంకుషాపూర్ గ్రామంలో అద్దెకు ఉంటున్నాడు. రోజువారిగా సత్తయ్య అతని భార్య సుభద్ర కూలీ పనుల కోసం వెళ్లగా కుమారుడు గణేష్ బందువుల అబ్బాయి శ్రీనివాస్(5)తో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు ప్రహారికోసం తవ్విన నీటిగుంటలో పడ్డాడు గమనించిన శ్రీనివాస్ పక్కింటి వారికి గణేష్ నీటిగుంటలో పడిన విషయం చెప్పడంతో స్థానికులు నీటిగుంటలోకి దిగి గణేష్‌ను వెలికితీసి కడుపుపై వత్తడంతో ముక్కు, నోటిలో నుంచి నీరు వచ్చిందని తెలిపారు.

