Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓ సామాన్యుడి 'ఆత్మకథ`

ఓ సామాన్యుడి 'ఆత్మకథ`

వారాహి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సోమేష్ నిర్మాతగా, శ్రీనివాస్ బండ్రెడ్డి రచనా దర్శకత్వంలో రానున్న చిత్రం 'ఆత్మ కథ- యాన్ అన్ టోల్డ్ స్టోరీ.

సినీ ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతుల మీదగా ఈ చిత్ర టైటిల్, ట్రైలర్ లాంచ్ జరిగింది. జెమిని సురేష్ హీరోగా, రూప కథానాయికగా నటించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ గుండ్రెడ్డి మాట్లాడుతూ,' నా ప్రతి సినిమాకు నా వెనుక ఉండి నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన వ్యక్తి మా అన్నయ్య ప్రసన్న.

ఈ చిత్ర నిర్మాత మా ఇంటి ఓనర్, ఆయన కుమారుడే ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. సినిమాకు డబ్బింగ్ తప్పించి మిగతా అన్ని పనులు నేను ఇంట్లోనే చేసుకుంటాను. మా పిల్లలు కూడా మంచి టెక్నీషియన్స్. దాని వల్ల నా నిర్మాతకు బడ్జెట్ తగ్గుతుంది అని తెలిపారు.

నటుడు జెమిని సురేష్ మాట్లాడుతూ,'యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, క్రియేటివ్ డైరెక్టర్ స్థాయి నుంచి కష్టపడి ఈరోజు 'ఆత్మకథ' సినిమా ద్వారా ప్రధాన హీరోగా మారాను. ఒక ఇంట్లో జరిగే కథగా రూపొందిన 'ఆత్మకథ' కామన్ మ్యాన్ ఎమోషన్స్, భయం, వినోదంతో కూడిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రం. ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలో చూసి ఆదరించాలని ప్రేక్షకులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను` అని అన్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, సమ్మెట గాంధీ, షకలక శంకర్, తాగుబోతు రమేష్, ధనరాజ్, నాగ మహేష్, బలగం విజయలక్ష్మి, శ్రీనివాస్ నాయుడు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం : శ్రీనివాస్ గుండ్రెడ్డి, నిర్మాత : అర్థం వారాహి సోమేష్, సంగీత దర్శకుడు : శ్రేయాంశ్, ఎడిటర్ : రాఘవేంద్ర రెడ్డి, డిఓపి : గోపి, లిరిసిస్ట్ : ఉమా వంగూరి (యుఎస్ఎ), విఎఫ్ఎక్స్ : చరణ్ గుండ్రెడ్డి, యాక్షన్ : దేవరాజ్ మాస్టర్, కొరియోగ్రఫీ : రెక్కీ మాస్టర్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana