
హైదరాబాద్ : పురుషుల ఆర్చరీలో భారత టాప్ ఆర్చర్ అతాను దాస్ అదరగొట్టాడు. గురువారం పురుషుల వ్యక్తిగత విభాగంలో జరిగిన 1/16 ఎలిమినేషన్ రౌండ్‌లో ఆయన కొరియన్ ఆర్చర్ జిన్‌హెక్‌పై 6-5 తేడాతో సంచలన విజయం సాధించారు. దీంతో అతాను ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. జిన్ హెక్ 2012 లండన్ ఒలిపింక్స్‌లో గోల్డ్‌మెడలిస్ట్ కావడం విశేషం. అంతకుముందు అతాను దాస్ 1/32 ఎలిమినేషన్ రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన యూ చెంగ్ డెంగ్‌పై 6-4 తేడాతో ఘన విజయం సాధించాడు.