Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

పాడి రైతుల బిల్లుల చెల్లింపుపై హర్షం

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకంనవతెలంగాణ - ఆలేరు రూరల్

ప్రభుత్వం పాడి రైతుల పెండింగ్ బిల్లులను చెల్లించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆలేరు మండలం మంతపురి గ్రామంలో గురువారం ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్య చిత్రపటానికి గ్రామ సర్పంచ్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, పాడి రైతులు ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కర్రె ఎల్లయ్య,కొరటూరి బిక్షపతి,పేరపు స్వామి,సంతోష్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి,కొరుటూరి సతీష్,రవి,వీరాచారి,లింగం తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana