Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాలకులు వైఫల్యాలపై సమరశీల పోరాటాలు

పాలకులు వైఫల్యాలపై సమరశీల పోరాటాలు

పొత్తులు ఎన్నికల వరకే పరిమితంవచ్చే ఎన్నికల్లో పొత్తులుంటే ఐదు స్థానాలు, లేదంటే 10-15 స్థానాల్లో పోటీ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ ​కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై సమరశీల పోరాటాలకు సంసిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

రాజీలేని పోరాటాలతో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా పనిచేయాలని సూచించారు. సోమవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ వనపర్తి జిల్లా కార్యదర్శి విజయ రాములు అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర సమితి సమావేశాలు నిర్వహించారు. బాగం హేమంతరావు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సమావేశంలో సీపీఐ సెంట్రల్ కమిషన్ చైర్మెన్ డాక్టర్.కె.నారాయణ, జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, ఈటి నరసింహా, కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్యపద్మ , భాగం హేమంతరావు, వి.ఎస్బోస్, కలవేన శంకర్, ఎం.బాలనరసింహ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ..దక్ష‍ిణాది రాష్ట్రాల్లో బీజేపీకి తావులేదన్నారు. తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రావడం సాధ్యంకాదన్నారు. ప్రజల్లోని అసంతృప్తి కదిలించే శక్తి లెఫ్ట్ పార్టీలకే ఉందని చెప్పారు. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి యువతను బొద్దింకలతో పోల్చడం, దానికి 'కాక్రోచ్ జనతా పార్టీ' అని పేరు పెట్టి సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి లభించిన అపూర్వ మద్దతే ప్రజలకు ప్రభుత్వాలపై ఉన్న అసంత్పపికి నిదర్శనమన్నారు.

ప్రజలు మంచి వేదిక కోసం చూస్తున్నారనీ, ఆ వేదిక సీపీఐ కావాలని ఆకాంక్ష‍ించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు. రైతులు, ధాన్యం సమస్యలు, ఆర్టీసీ, కనీస వేతనాలు, సింగరేణి, పోడు భూములు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరత వంటి అనేక అంశాలపై పోరాడుతున్నామని తెలిపారు. పొత్తుధర్మం ఎన్నికల వరకే పరిమితమనీ, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. కనీస వేతనాల పెంపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో పొత్తు ఉంటే కనీసం ఐదు అసెంబ్లీ స్థానాలకు తగ్గకుండా పోటీ చేయాల్సిందేననీ, అందుకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సూచించారు. పొత్తు కుదరకపోతే 10 నుండి 15 స్థానాల్లో ఒంటరిగానైనా పోటీ చేసే శక్తిని సంపాదించుకోవాలని పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana