నవతెలంగాణ-హయత్‌నగర్
ఎల్బీనగర్ నియోజక వర్గం పరిధిలో ఉన్న ప్రయివేటు పాఠశాలల ఫీజులు నియం త్రించాలని ఎల్బీనగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి హయత్‌నగర్ పేరేంట్స్ కమిటి గురువారం వినతి పత్రం అందజేసింది. హయత్‌నగర్‌లో ఉన్న జీ స్కూల్ యాజమాన్యం కరోనా వేళ కూడా 70 శాతం ఫీజులు చెల్లిం చాలని లేనియేడల విద్యార్థులను ఆన్‌లైన్ తరగ తుల నుంచి తొలగిస్తున్నారని దీంతో చాలా మంది విద్యార్థులు చదువుకోలేక నష్ట పోతున్నారని వినతి పత్రంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ సాగర్, ఫర్జానా, శ్రీధర్ రెడ్డి, మధన్ గౌడ్, శ్రీకాంత్, రాజేందర్, ఇలియాస్, జనార్ధన్ పాల్గొన్నారు.

