Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా జలీల్

పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా జలీల్

- ఒకటో తేదీ వరకు శ్రీదేవసేనకు సెలవు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఎ శ్రీదేవసేనకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 19 నుంచి వచ్చేనెల ఒకటో తేదీ వరకు శ్రీదేవసేన ఎర్న్‌డ్‌ లీవులో ఉంటారని ప్రకటించారు. వచ్చేనెల 2 సాధారణ సెలవు ఉంటుందని తెలిపారు. ఆమెకు కరోనా వైరస్‌ సోకడంతో ప్రభుత్వం సెలవులు ఇచ్చినట్టు తెలిసింది. పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ)గా ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ను అప్పగించారు.

ఆమె సెలవులు పూర్తికాగానే పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా తిరిగి బాధ్యతలు స్వీకరించాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana