Dailyhunt
పదవి విరమణ పొందిన ఆర్మీ జవాన్కు ఘన సన్మానం

పదవి విరమణ పొందిన ఆర్మీ జవాన్కు ఘన సన్మానం

వతెలంగాణ - కామారెడ్డికామారెడ్డి పట్టణంలోని కల్కి నగర్లో నివసిస్తున్న పదవి విరమణ పొందిన ఆర్మీ జవాన్ శివేంద్ర స్వామిని మంగళవారం ఘనంగా సన్మానించారు.

టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని కలిపి నగర్ లో గల ఆయన నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, భారత సైన్యంలో 24 సంవత్సరాల పాటు సేవలందించిన శివేంద్ర స్వామి దేశ సరిహద్దులను కాపాడుతూ నిస్వార్థంగా విధులు నిర్వర్తించారని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవ చేసిన జవాన్ల త్యాగాలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. పదవి విరమణ పొందడం ఒక గర్వించదగ్గ సందర్భమని, ఇలాంటి సైనికులను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గడ్డమీది మహేష్, జూలూరి సుధాకర్, మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, చాట్ల వంశీ, సలీం, జమీల్, రంగ రమేష్, గంగుల్ రెడ్డి, రాజశేఖర్, నిరంజన్, కోటి, శశి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana