Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పద్మజా ఆస్పత్రి సౌజన్యంతో సూచిక బోర్డులు

పద్మజా ఆస్పత్రి సౌజన్యంతో సూచిక బోర్డులు

భువనగిరి: పట్టణానికి చెందిన డా.పద్మజ దివాకర్‌ రెడ్డి, డా.పద్మజ సంతాన సాఫల్య కేంద్రం, భువనగిరి, హబ్సిగూడ, హైదరాబాద్‌ సౌజన్యంతో రూ.30,000లతో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను గురువారం భువనగిరి ట్రాఫిక్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణం లోని జగదేకపూర్‌ చౌరస్తా, పాతబస్టాండ్‌, వినాయక చౌరస్తా, జిల్లా ఆస్పత్రి, నల్గొండ బ్రిడ్జ్‌, సావర్కర్‌ చౌరస్తా సింగన్నగూడెం, హౌసింగ్‌ బోర్డ్‌, బొమ్మాయిపల్లి చౌరస్తా, భువనగిరి చెరువు అలుగు, డాల్ఫీన్‌ హోటల్‌ చౌరస్తా, బీబీనగర్‌ బ్రిడ్జ్‌, ఎయిమ్స్‌ చౌరస్తా, బొమ్మల రామారం మండలం, నాగినేనిపల్లి చౌరస్తాలో సూచిక బోర్డులను రోటరీ క్లబ్‌ దాతల సహకారంతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్‌ తెప్పల రఘు, రోటరీ క్లబ్‌ అధ్యక్షులు వెంకట్‌ రెడ్డి, కార్యదర్శి రామకష్ణ, బండారు బాలరాజు, మాజి అధ్యక్షులు గడ్డం జ్ఞాన ప్రకాష్‌ రెడ్డి, ఎన్నిక అధ్యక్షులు చెన్న లక్ష్మణ్‌, డా.పద్మజ ఆసుపత్రి ప్రతినిధి గొల్ల నారాయణ, పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana