Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పల్సి లో మొక్కజొన్న పంట దగ్ధం

పల్సి లో మొక్కజొన్న పంట దగ్ధం

వతెలంగాణ-కుభీర్మండలంలోని పల్సి గ్రామంలో శుక్రవారం కోసి కుప్పలు వేసిన మొక్కజొన్న, జొన్న పంట ప్రమాదవశత్తు కాలి బూడిద కావడం జరిగింది. గత 15 రోజులు కిందట మొక్కజొన్న జొన్న పంటలు కోసి కుప్పలు వేసి పూర్తిగా ఎండిపోవడంతో దీంతో అధిక ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో మండలంలో అగ్ని ప్రమాదాల సంఖ్య రోజుకు పెరిగిపోతుంది.

గత రెండు రోజుల క్రిందటనే ఇదే గ్రామంలో ప్రమాదవశత్తు ఫైల్ ఫామ్ మొక్కలు కాలిపోవడం జరిగింది. దీంతో గత కొన్ని రోజుల వ్యవధిలోనే మండలంలోని దార్ కుభీర్,మాలేగా, కుబీర్, గోడ పూర్, ఫార్డి బి, ఫార్డి కే గ్రామాల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవించిన సంఘటనలు మరవకముందే, మళ్లీ పల్సి గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది.

ఈ అగ్ని ప్రమాదం వల్ల రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలు కండ్లమందే ఖాళీ బూడిద కావడంతో ఆందోళన చెందుతున్నారు. రైతులు వ్యవసాయ క్షేత్రంలో కష్టపడి ఎండనక వానక లక్షలు ఖర్చులు చేసి కళ్ళముందే కాలిగా బూడిద కావడంతో ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఎదురు కోవడం జరుగుతుంది. మండలంలో ఇన్ని అగ్ని ప్రమాదాలు జరిగిన ప్రభుత్వం కనీసం వారి వైపు కన్నెత్తి చూడకుండా వివరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఆయా గ్రామంలో అగ్రి ప్రమాణాలు సంభవించిన సంఘటనలు అధికారులు పరిశీలించినప్పటికీ ప్రభుత్వం తరఫునుంచి శాంతి స్పందన రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుచున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana