Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పని చేయనిసిబిఎస్ఇ రీ వాల్యుయేషన్ పోర్టల్

పని చేయనిసిబిఎస్ఇ రీ వాల్యుయేషన్ పోర్టల్

విద్యార్థుల ఎదురుచూపులు స్పందించని అధికారులు

న్యూఢిల్లీ : 12వ తరగతి రీ వాల్యుషన్ పోర్టల్ జూన్ 1 నుంచి అందుబాటులోకి వస్తుందని సిబిఎస్ఇ ప్రకటించిన సంగతి తెలిసిందే .

అయితే అది ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. సోమవారం అంతా ఈ పోర్టల్ కోసం విద్యార్థులు ప్రయత్నించి పూర్తిగా నిరాశ చెందారు. మే నెల ప్రారంభంలో జవాబు పత్రాల యాక్సెస్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారిలో మరింత ఆందోళనలను పెంచింది. వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు తమ ఫలితాలను సమీక్షించుకోవడానికి, అవసరమైన చోట దిద్దుబాట్లు కోరడానికి వీలుగా ధృవీకరణ, ఫోటోకాపీ, పునఃమూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ రీ వాల్యుషన్ పోర్టల్ మే 29 న ప్రారంభం అవుతుందని సిబిఎస్ఇ ముందుగా ప్రకటించింది. కానీ వెబ్సైట్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని, దరఖాస్తు ప్రక్రియ మరింత సజావుగా సాగడానికి అదనపు సమయం అవసరమని పేర్కొంటూ సిబిఎస్ఇ ఈ తేదీని మే 29 నుంచి జూన్ 1కి వాయిదా వేసింది. పారదర్శకతను, మూల్యాంకన ప్రోటోకాల్లను మరింత సమర్థవంతంగా పాటించడం కోసమే ఈ వాయిదా వేసినట్లు అప్పట్లో సిబిఎస్ఇ సోషల్ మీడియా ఎక్స్ లో చేసిన ఒక పోస్ట్లో తెలిపింది. భారీ సంఖ్యలో విద్యార్థులు ఒకేసారి సేవలను ఉపయోగించినా ఎలాంటి అంతరాయాలు రాకుండా వెబ్సైట్ను అప్గ్రేడ్ చేస్తున్నట్లు అధికారులు కూడా తెలిపారు.

అయితే, సవరించిన ప్రారంభ తేదీ అంటే జూన్ 1 వచ్చినా కూడా రీ వాల్యుషన్ పోర్టల్ అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులు ఆందోళనతో ఉన్నారు. 12వ తరగతి మూల్యాంకనం కోసం సిబిఎస్ఇ కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఒఎస్ఎం) విధానంపై విమర్శలు వెళ్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ జాప్యం మరింత ప్రాముఖ్యతగా మారింది. ఈ పోర్టల్ ప్రారంభం అయిన తరువాత విద్యార్థుల నుంచి భారీ స్పందన ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్కాన్ చేసిన జవాబు పత్రాలను పొందేందుకు ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు అందినట్లు సమాచారం. విద్యార్థులు తమ జవాబు పత్రాలను సమీక్షించుకున్న తర్వాత మార్కుల ధృవీకరణకు దరఖాస్తు చేసుకోవచ్చు, అలాగే, మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల ఫోటోకాపీలతో పాటు నిర్దిష్ట జవాబుల పునఃమూల్యాంకనంను అభ్యర్థించివచ్చు. కానీ ఇవన్నీ రీ వాల్యుషన్ పోర్టల్ ప్రారంభమైనప్పుడే సాధ్యమవుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana