Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంట మార్పిడితో అధిక దిగుబడి

పంట మార్పిడితో అధిక దిగుబడి

- భూసార పరీక్షల ద్వారా పంటలు వేసుకోవాలి శాస్త్రవేత్తలు అర్చన, కళ్యాణినవతెలంగాణ - మిడ్జిల్
రైతులు పంట మార్పిడి చేస్తే అధిక దిగుబడి వస్తుందని, భూసార పరీక్షల ద్వారా పంటలు వేసుకుంటే రైతులుకు పంటలు లాభదాయకంగా వస్తుందని విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ హర్షణ, కళ్యాణ్ చెప్పారు.

దుందిబి ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో మండలంలోని కొత్తూరు గ్రామంలో రైతు వేదికలో ఎరువులు, విత్తనాలు పంటల మార్పిపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో శాస్త్రవేత్తలు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సేంద్రీయ ఎరువులతో పంటలు పండించాలని, రసాయన ఎరువులు యూరియా తక్కువగా వాడాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్న వడ్లు వడ్లు, దొడ్డు రకం వడ్లు ఆర్ఎన్ఆర్, కేఎన్ఎం రకాలను వానకాలంలో నాటుకోవాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి సిద్ధార్థ మాట్లాడుతూ.. పంట మార్పిడి లో భాగంగా వరి తర్వాత పెసర మినుము జొన్న పోద్ధతిరుడు రాగి వేరుశనగ వంటి పంటలను వేసుకోవడం ద్వారా నేల సారవంతంగా మారి దిగిపడే పెంచుతుందని రైతులకు సూచించారు.

సేంద్రీయ పద్ధతుల్లో ద్వారా వ్యవసాయం పంటలు జొన్న రాగి పంటలు పండిస్తే రైతులందరికీ ఆరోగ్యంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పారు. సర్పంచ్ రాములు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రైతుల కోసం సస్పిడిపై విత్తనాలను అందిస్తుందని తెలిపారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సాయి ప్రసాద్, నాయకులు సత్యం గుప్తా, ప్రతాపరెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, దుందుభి ఫార్మా కంపెనీ చైర్మన్ వెంకటయ్య, డైరెక్ట్ లు కృష్ణారెడ్డి దశరథం సీఈవో నరేష్, ఉప సర్పంచ్ అర్జున్, వార్డు సభ్యులు బాలరాజు, బాలస్వామి, జంగిలయ్య, ఆంజనేయులు రైతులు దేవయ్య, రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana