Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంతంగిలో సీపీఐ(ఎం) సీనియర్ నేతల స్మారక స్తూపాల ఆవిష్కరణ

పంతంగిలో సీపీఐ(ఎం) సీనియర్ నేతల స్మారక స్తూపాల ఆవిష్కరణ

వతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు కామ్రేడ్ చిట్యాల బుచ్చిరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా నిర్మించిన స్తూపాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు.

అదేవిధంగా కామ్రేడ్ రొడ్డ అంజయ్య నాలుగో వర్ధంతిని పురస్కరించుకొని ఆయన స్తూపం వద్ద సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. కామ్రేడ్ చిట్యాల బుచ్చిరెడ్డి,రొడ్డ అంజయ్య ఇద్దరూ చివరి శ్వాస వరకు కమ్యూనిస్టుగా ఉంటూ పేద ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేశారన్నారు. ఈ ప్రాంతంలో సీపీఐ(ఎం) పార్టీ విస్తరణకు వారు విశేష కృషి చేశారని కొనియాడారు. కామ్రేడ్ కందాల రంగారెడ్డితో కలిసి అనేక ఉద్యమాలు నడిపారని గుర్తుచేశారు. అమరుల ఆశయ సాధన కోసం పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేయడమే వారికి నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. అసమానతలు,దోపిడీ లేని సమసమాజ స్థాపన కోసం పోరాటాలను ఉధృతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, వెలిమినేడు సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, చౌటుప్పల్ మండల శాఖ కార్యదర్శి గంగాదేవి సైదులు, సింగిల్ విండో మాజీ చైర్మన్ చిర్క సంజీవరెడ్డి, సీపీఐ(ఎం) మండల నాయకులు పొట్ట శ్రీనివాస్,సీపీఐ(ఎం)గ్రామ శాఖ కార్యదర్శి వార్డు సభ్యులు రత్నం శ్రీకాంత్, స్థానిక నాయకులు నేరడి మహేష్, బర్రె రాజు పెరియర్,రొడ్డ శ్రీకాంత్,చేకూరి రమేష్,రొడ్డ భగత్ సుక్క శ్రీకాంత్,బోయ సాయి కిరణ్, బర్రె శశిధర్, బోయ పృథ్వీరాజ్, కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana